HYD: పేదల జీవితాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమాషాగా ఉందా..? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇండ్లకు మార్కింగ్ చేస్తూ ఇండ్లు కూల్చివేస్తామంటూ రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో శనివారం లంగర్‌హౌస్ డివిజన్లోని రాందేవూడ, బాపూనగర్ ప్రాంతాలను కిషన్ రెడ్డి సందర్శించారు.