TG: కేబినెట్ సమావేశం తేదీలో మార్పు చోటుచేసుకుంది. ఈనెల 26న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్ధంగా మారడం, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా విధివిధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి టాపిక్స్‌పై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ సమావేశం 23వ తేదీన జరుగుతుందని వెల్లడించారు.