AP: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వ తీరుకి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు రైతు భరోసా లేదని చెబుతున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.