KMM: రుణమాఫీ కోసం రైతులు కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవాలని కామేపల్లి మండల వ్యవసాయ అధికారి బి.తారాదేవి కోరారు. సంబంధిత రైతులు ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో కామేపల్లి రైతు వేదికకు వచ్చి ధ్రువీకరణ పత్రం పూర్తి చేసి కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవాలని కోరారు. మండలంలో 430 మంది రైతులు కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసుకోవలసి ఉందన్నారు.