జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసే పోటీ చేస్తామని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 70 చోట్ల కాంగ్రెస్-JMM తన అభ్యర్థులను నిలబెడుతాయని వెల్లడించారు. మిగతా 11 సీట్లకు ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.