GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ 6వ సారి శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంగా శనివారం ఉప్పరపాలెం గ్రామం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 101 టెంకాయలతో తమ మొక్కుబడి చెల్లించుకున్నారు. దేవస్థానం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ధూళిపాళ్లకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.