అందరికీ బంగారమంటే ఆభరణాలే అని తెలుసు. కానీ, ఇటీవల తినే బంగారం మార్కెట్లోకి వచ్చింది. దీన్నే ఎడిబుల్ గోల్డ్ అంటారు. దీంతో తయారు చేసిన పదార్థాలు రుచిగా ఉంటాయి. స్వీట్లకు, వివిధ తినుబండరాలకు వాడే సిల్వర్ షీట్లు ఎలా దొరకుతాయో ఇవి కూడా గోల్డ్ ఫ్లేక్స్, గోల్డ్ లీఫ్, గోల్డ్ డస్ట్ పేర్లతో అనేక రకాలుగా దొరకుతాయి. వీటిని ఐస్క్రీమ్లు, స్వీట్లు, పండ్లు, వివిధ పదార్థాలలో కలిపి తినే అవకాశముందని నిపుణులు అంటున్నారు.