TG: బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. దీంతో పోలీసులు, గ్రూప్ 1 అభ్యర్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు సచివాలయం వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్కే భవన్ దగ్గర రోడ్డుపై బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు.