NLR: కొడవలూరు మండలంలోని ఎల్లాయపాలెం అంగన్వాడి కేంద్రం కేంద్రం నందు శనివారం మునగాకు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మునగాకుతో కొన్ని వంటకాలు తయారు చేశారు. మునగాకులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయని స్థానికులకు తెలియజేశారు. ఆయుర్వేదంలో కూడా మునగాకును ఉపయోగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.