KMR: జిల్లా పశు వైద్యాధికారిగా డాక్టర్ పి. శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇంతవరకు కరీంనగర్ నుంచి కామారెడ్డికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన రాజేశ్వర్ సంగారెడ్డి జిల్లాకు పశుసంవర్ధక అధికారిగా బదిలీపై వెళ్లారు. ఇద్దరు అధికారులకు టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.