NRML: తడి పొడి చెత్తను వేరు చేసి వ్యవసాయానికి అందుబాటులో ఉండేలా సేంద్రియ ఎరువులను తయారు చేయాలని ఎంపీవో గోవర్ధన్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలం లోలం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్డును సందర్శించారు. ప్రతిరోజు గ్రామంలో నుంచి సేకరించిన చెత్తను తడి, పొడి వేరుచేసి సేంద్రియ ఎరువులు తయారుచేయాలని సూచించారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు.