KMM: దమ్మపేట మండలం గోపాలపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయులే కరువయ్యారు. విద్యార్థులకు ఆరు నెలలుగా సోషల్ సబ్జెక్టును ఎవరూ బోధించడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడు నేటి వరకు విద్యార్థులకు పాఠాలు బోధించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.