SRD: రైతు భరోసా నిధులు విడుదల చేయనందుకు జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.