NGKL: కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ చట్టాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.