MDK: భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళాలోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత అని చాకలి ఐలమ్మ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.