SRD: హత్నూర గురుకుల పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఈ నెల 21న అప్రెంటిస్ షిప్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వి.వి.సుబ్బలక్ష్మి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకొని సరైన ద్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.