ys sharmila:కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక: వైఎస్ షర్మిల విసుర్లు
ys sharmila:రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. రేవంత్ రెడ్డి (revanth reddy) కేసీఆర్ (kcr) మాట వింటారని పేర్కొన్నారు. రేవంత్ చేసేది పాదయాత్ర (padayatra) కాదు.. కారు యాత్ర (car yatra) అని మండిపడ్డారు. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర (praja prastana padayatra) జనగామ జిల్లాలో జరుగుతోంది.
ys sharmila:రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి (revanth reddy) కేసీఆర్ (kcr) మాట వింటారని పేర్కొన్నారు. సోనియా గాంధీ (sonia gandhi) మాట వినరని తెలిపారు. రేవంత్ చేసేది పాదయాత్ర (padayatra) కాదు.. కారు యాత్ర (car yatra) అని మండిపడ్డారు. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర (praja prastana padayatra) జనగామ జిల్లాలో జరుగుతోంది. బస్టాండ్ వద్ద బహిరంగ సభ వేదికపై నుంచి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అని.. ఆయన చేసేది దొంగ యాత్ర అని విరుచుకుపడ్డారు. బీజేపీ విభజన హామీలను నెరవేర్చలేదని షర్మిల మండిపడ్డారు.
కబ్జారెడ్డి..
జనగాం ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి కాదు..కబ్జా రెడ్డి అని షర్మిల విరుచుకుపడ్డారు. ఇతనిని కేసీఆర్ (kcr) బాగానే మేపుతున్నారని తెలిపారు. 500 ఎకరాలు (500 acres) కబ్జా పెట్టాడని తెలిసిందన్నారు. కేసీఆర్‌కి ఒక్క ఫామ్ హౌజ్ (farm house) ఉంటే.. ఈయనకు మూడు ఫామ్ హౌజ్‌లు ఉన్నాయట కదా అన్నారు. ఓ ఫామ్ హౌజ్ కోసం గిరిజన తండానే (tanda) ఖాళీ చేయించాడని చెప్పారు. ఏ భూమి వదలడట..అన్ని భూములు కబ్జా చేస్తాడట అని మండిపడ్డారు. గతంలో చైన్ మెన్ ఉద్యోగం చేసేవాడని పేర్కొన్నారు. కొలతలు వేసే ఉద్యోగం చేసి రెవెన్యూ శాఖలో (revenue) అన్ని లొసుగులు కనుక్కున్నాడని వివరించారు.
ముస్లిం, గిరిజనుల భూములు కబ్జా
ముస్లింల (muslims) భూములు, గిరిజన (tribal) భూములు, చెరువులను (lake) కబ్జా చేశారని పేర్కొన్నారు. ముత్తిరెడ్డి కబ్జా కోర్ అని మహిళ ఐఏఎస్ (woman ias officer) రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కబ్జా చేస్తే కొడుకునైన వదలను అన్న కేసీఆర్.. ఇప్పుడేం చేస్తున్నారని అడిగారు. కబ్జారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఐఏఎస్ అధికారినే బదిలీ చేశారని మండిపడ్డారు. జై కేసీఆర్ అనకుంటే ప్రభుత్వ పథకాలు ఇవ్వమని ఎలా అంటామని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలపై ఈయన పెత్తనం ఎంటి అని నిలదీశారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచాం అని సోయి లేదా అని అడిగారు. ప్రభుత్వ పథకాలు ఈయన ఇంట్లో నుంచి ఇచ్చాడా..? అని ప్రశ్నించారు.
కరువు ప్రాంతం
జనగామ అంటే ఒకప్పుడు కరువు ప్రాంతం అని, వలస పోయే ప్రాంతం అని షర్మిల (sharmila) చెప్పారు. ఎకరా 10 వేలు పలకని చోట ఇప్పుడు అధిక డిమాండ్ వచ్చిందని తెలిపారు. పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ఆర్ (ysr) అన్నీ చూశారని షర్మిల తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ కట్టారని తెలిపారు. దాంతో 12 రిజర్వాయర్లు నింపారని తెలిపారు. జనగామ బంగారం అయ్యిందన్నారు. రిజర్వాయర్లు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయని.. బోర్లు వేస్తే పుష్కలంగా వాటర్ (water) వచ్చాయని వివరించారు. జనగామ భూములకు ఇంత ధర పలుకుతుందటే అదీ వైఎస్ఆర్ కారణం అని తెలిపారు. జనగామకు తాగునీటిని వైఎస్ఆర్ అందించారని గుర్తుచేశారు. చీటకొడురు రిజర్వాయర్ కట్టించి ఇంటింటికీ త్రాగునీరు ఇచ్చారని తెలిపారు.