Workers get sick after eating snake-infested sambar
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కంపెనీ క్యాంటీన్(Canteen) లో సాంబార్ తిని శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగస్తులు అస్వస్థత(Employees sick)కు గురి అయ్యారు. అయితే వీరు తిన్న సాంబార్ లో పాము(Snake) ఉండడంతో ఎంప్లైయిస్ అనారోగ్యం పాలు అయ్యారు. ఈ విషయం తెలియక అప్పటికే తిన్నవారు కంగారుపడ్డారు. విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగస్తులు అధికారులను ఫిర్యాదు చేశారు. అస్వస్థతపాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అసలు క్యాంటీన్ లోకి పాము ఎలా వచ్చింది అనేదానిపై అందరూ చాలా రకాలుగా ఆలోచిస్తేన్నారు.
ఎప్పటిలాగే మధ్యాహ్నం ఉద్యోగస్తులు లంచ్ చేశారు. తరువాత కొంత సేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ECIL) హాస్పిటల్ కు సిబ్బందిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సంబారు తిన్న మరో నలుగురిని కూడా అదే హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్యులు. అయితే సాంబార్ లోకి పాము ఎలా వచ్చిందనే అంశంపై క్యాంటీన్ నిర్వహకులు సైతం విస్తుపోతున్నారు.