తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత అలిగారా..? లేదంటే కేసీఆర్ ఆమెను దూరం పెట్టారా..? ప్రస్తుతం ఇవే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఎందుకంటే… కేసీఆర్ దసరా పండగరోజున బీఆర్ఎస్ పార్టీని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సమయంలో.. కనీసం కవిత జాడ కూడా కనపడలేదు.
అక్కడ కీలకంగా కనపడాల్సిన ఆమె కనిపించకపోగా… కనీసం ఆ విషయం పై ఎక్కడా స్పందించనూ లేదు. పైగా ఆ సమయంలో.. తాను వాహన పూజ చేసుకున్నానంటూ ఫోటోలు పెట్టడం మరింత చర్చకు దారితీసింది.
కేసీఆర్ కుటుంబంలో విభేధాలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానికి ఇదే నిదర్శనమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్వ సభ్య సమావేశానికి మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కవిత మాత్రమే గైర్హాజరు కావడంపై ప్రతిపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ రాష్ట్రం బాధ్యతలను కేటీఆర్ కి అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయంలోనే వారి మధ్య మనస్పర్థులు వచ్చాయనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే కవిత ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.