ఈ నెల 12న జరగాల్సిన టీపీవోబీ( Town Planning Building Overseer ) పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని టీఎస్పీఎస్సీ (TSPSC)తెలిపింది. హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.అయితే, అనూహ్యంగా చివరి నిమిషంలో టీఎస్ పీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. రేపు జరుగబోయే అన్ని పరీక్షలతో పాటు ఈనెల 15, 16వ తేదీల్లో జరిగే పరీక్షలనూ వాయిదా వేసింది. పరీక్షా పేపర్లు హ్యాక్ అయినట్లు గుర్తించి, పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.