»This Civil Services Topper Has Hyderabadi Connection
UPSC : సివిల్ సర్వీసెస్ టాపర్ మన హైదరాబాదీనే
సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.
UPSC : సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు UPSC ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాపర్లుగా నిలిచారు. 2022 సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ అమ్మాయిలే సాధించారు. ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో అదరగొట్టగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.
UPSC మంగళవారం ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాల్లో, ఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచింది. ఇషిత తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని బేగంపేటలో జన్మించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న ఇషిత క్యాడర్లో తన మొదటి ప్రాధాన్యతగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS)న ఎంచుకుంది. ఆమె తండ్రి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్, తల్లి రిటైర్డ్ టీచర్. సమాజానికి సేవ చేయాలనే తపనను వాళ్లను చూసి నేర్చుకున్నానని.. అదే తనను సివిల్ సర్వీసెస్ చేపట్టేలా చేసిందన్నారు ఇషిత.
రెండు ప్రయత్నాల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే, తన మూడవ ప్రయత్నంలో మొదటి స్థానంలో నిలిచింది. “పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించినందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను” అని ఇషిత చెప్పారు. ‘‘ఐఏఎఫ్ అధికారి అయిన మా నాన్నలా దేశానికి సేవ చేయాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. నేను పాలనలో ఎక్కువ భాగం కావాలనుకుంటున్నాను . నేను IASని ఎంచుకున్నాను. సివిల్ సర్వీసెస్ చాలా అవకాశాలను ఇస్తుంది, ”అని ఇషిత ఉప్పొంగిపోయింది.ఇషితా కిషోర్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. ఆమె 2017లో ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశఆరు. దీని తర్వాత, ఆమె రిస్క్ అడ్వైజరీలో ఎర్నెస్ట్ అండ్ యంగ్‌తో కలిసి పనిచేశారు.