Lok Sabha Results: తెలంగాణ లోక్ సభ ఫలితాలు.. ఖాతా తెరిచిన బీఆర్ఎస్
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే సాగుతున్నాయి. బీఆర్ఎస్ 1 లీడింగ్‌లో కొనసాగుతుండగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ కనబడుతుంది.
Lok Sabha Results: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడా ఆకర్షించలేక చతికిల పడింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్ 1, బీఆర్ఎస్ 1 స్థానికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. చాలా సమయం వరకు బీఆర్ఎస్ పార్టీ కనీసం ఖాతా తెరవకపోవడం దారుణంగా కనిపించింది. ఆ తరువాత అనూహ్యంగా ఒక్క స్థానంలో బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. మెదక్ లోక్ సభ స్థానంలో రఘునందన్ రావు బీజేపీ నుంచి, నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు.