టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు(telangana High court) తుది తీర్పును వెల్లడించింది. అంతకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న కేసులో నిందితులను రిమాండ్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు పిటిషన్ వేశారు.
హైకోర్టులో సైబరాబాద్ పోలీసుల పిటిషన్పై ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో నిందితులను రిమాండ్ కు అనుమతించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
నిందితులు రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, కోరె నందు కుమార్ అలియాస్ నందు, డీపీఎస్కేవీఎన్ సింహయాజిలు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచాలని ధర్మాసనం పేర్కొంది. ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించాలని చెప్పింది.