సత్యసాయి: ధర్మవరం పట్టణం 26వ వార్డు లక్ష్మీ చెన్నకేశవపురం మహాత్మా కాలనీలో ఆదివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు వైసీపీ ఇంఛార్జ్ గుజ్జల బొమ్మన్న అనుచరులతో కలిసి పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం వినాయక పూజలో పాల్గొని, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు.