TG: మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ గురించి తర్వాత, ముందు రిపోర్టుకు జవాబివ్వండని తెలిపారు. రేపో, ఎల్లుండో మీ పిటిషన్పై కోర్టు తేలుస్తుందని చెప్పారు. కోర్ట్లో చెప్పాల్సిన అంశాలను హరీష్ సభలో చెప్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై ఇప్పుడు హరీష్ మాట్లాడాలని స్పష్టం చేశారు.