GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం అగ్నిమధనం, పంచగవ్యారాధన, హోమాలు నిర్వహించి, పవిత్రోత్సవాలతో గ్రామోత్సవం చేశారు. ఈ పవిత్రోత్సవాలను చూసిన వారికి కూడా పుణ్యం లభిస్తుందని ప్రధాన అర్చకులు శ్రీనివాసదీక్షితులు తెలిపారు. ఆలయ ఈఓ సునీల్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.