E.G: వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితులకు సకాలంలో సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కొవ్వూరు మండలంలో 11 మంది లబ్ధిదారులకు రూ. 5,44,774 విలువైన చెక్కులను ఆయన అందించారు. కాపవరం గ్రామానికి చెందిన ముగ్గురికీ, ఐపంగిడికి చెందిన ఆరుగురికీ, ధర్మవరానికి చెందిన ఇద్దరికీ ఈ సాయాన్ని అందజేశారు.