వరంగల్ జిల్లా (Warangal District) భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి(Gollapally)లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన తొమ్మిది రోజులకే ఓ వధువు.. తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడించింది.పెద్దలు కుదర్చిన సంబంధానికి ఒప్పుకుని.. తలవంచి వరుడితో తాళి కట్టించుకుంది. అంతా బాగానే ఉంది అనుకుంటుండగానే.. పెళ్లి కూతురు అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ప్రియుడితో వెళ్లినా సరే.. వాళ్లయినా సంతోషంగా ఉంటే చాలనుకుంటే.. ఆ అమ్మాయి మాత్రం ఊహించని నిర్ణయం తీసుకుని అందరినీ ఆగం చేసింది. భీమదేవరపల్లి (Bhimadevarapalli) మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె.
మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం (marriage) జరిపించారు. ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్య(suicide)కు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎం (MGM) లో చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు.. ప్రియుడి బంధువుల వెర్షన్ మాత్రం వేరే విధంగా ఉంది. ప్రేమ విషయం అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసినా.. వేరు వేరు కులాలని పెళ్లికి ఒప్పుకోలేదని.. ఆరోపిస్తున్నారు.