»Rapido Free Bike Ride On Polling Day In The Telangana November 30th 2023
Free bike ride: పోలింగ్ రోజున ఫ్రీ బైక్ రైడ్
తెలంగాణలో ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రముఖ బైక్ రైడింగ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30న హైదరాబాద్‌లో ఓటర్లకు ఫ్రీ రైడ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు.
Free bike ride on polling day in the telangana november 30th 2023
తెలంగాణ ఎన్నికల(telangana assembly elections 2023) నేపథ్యంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్లకు సహాయం చేయడానికి Rapido సంస్థ కీలక అనౌన్స్ మెంట్ చేసింది. ఓటింగ్ రోజును హైదరాబాద్‌లో ఓటర్లకు ఫ్రీగా బైక్ రైడింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ర్యాపిడో సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న 2,600 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలకు ఉచిత రైడ్లను అందించనున్నట్లు వెల్లడించారు.
భారత ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఎన్నికలు చాలా కీలకం. ఆ వ్యవస్థలో భాగంగా పోలింగ్ విషయంలో అనేక మంది వారి ఓటు హక్కును వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నారని Rapido సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అన్నారు. ఈ క్రమంలో వారి బాధ్యతను గుర్తు చేస్తూ రవాణా గురించి ఆందోళన చెందకుండా ఓటు వేయడానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని తమ వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల రోజున ఉచిత బైక్ రైడ్ సౌకర్యం కల్పించడం ద్వారా ఎక్కువ మంది పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు.
అయితే ఈ సౌకర్యం ఉపయోగించుకునేందుకు వినియోగదారులు iOS లేదా Android ఫోన్లలో Rapido యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. హోమ్‌పేజీ బుకింగ్‌పై రైడ్ గురించి సమాచారం అందుబాటులో ఉంటుందని, నిర్దేశించిన పికప్ స్పాట్లో రైడర్లు సమయానికి కనిపిస్తారని పేర్కొన్నారు. రాపిడో రైడర్లు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తారని.. కాబట్టి వారు ఎల్లప్పుడూ తమతో పాటు అదనపు హెల్మెట్‌ని కూడా తీసుకువస్తారని వెల్లడించారు.