HYD: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని PJR నగర్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. 10 రోజులుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న అధికారులు, కార్పొరేటర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు డ్రైనేజీ.. మరోవైపు దోమల బెడద ఎక్కువగా ఉండి అనారోగ్యం పాలవుతున్నామని మండిపడుతున్నారు.