తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు వాగ్ధానాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. విజయభేరి సభ వేదికపై ఆ వాగ్ధానాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటిస్తారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండాను ఎగరేశారు. జెండా తలకిందులుగా ఉండగా.. దానికి సెల్యూట్ చేశారు.
టూరిస్టు ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొండలు లేదా జలపాతలు లేదా ఆయా ప్రదేశాల వద్ద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెెప్పలేం. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. టూర్ కోసం వెళ్లిన పర్యటకుల వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత చెందారు.
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో ఇచ్చే ఆరు గ్యారంటీలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టంచేశారు.
ఆస్పత్రులకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడ చుసినా కామాంధులే తయారయ్యారు. గతంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఏకంగా హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసులకు తెలుపడంతో బహిర్గతమైంది.
తెలంగాణ విమోచన దినోత్సవం(telangana liberation day) వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా ఈ దినోత్సవం గురించి పలు పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భాగ్యనగరం(hyderabad)లో ఫేక్ సర్టిఫికెట్లు(Fake certificates) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఆ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి అనేక యూనివర్సిటీలకు చెందిన ద్రువపత్రాలు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కింది వీడియోలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) హాజరయ్యారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 పై చిలుకు గ్రామాలకు తాగునీరు అందింది.