ఇటివల కాలంలో ప్రతి దానిలో కూడా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు సాధారణం అయిపోయింది. ఉప్పు, పప్పు, పసుపు, కారం నుంచి మొదలుకుని నూనె, అయిల్, పెట్రోల్ ను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాది హైదరాబాద్లో నిర్వహణ సరిగ్గా చేయలేదని అందుకే వచ్చే ఏడాది నిర్వహించనున్న దానిపై క్లారిటీ రాలేదని తెలుస్తోంది. గతంలో నిర్వహించిన సమయంలో జరిగిన లోపాలు సరిచేస్తేనే వచ్చే ఏడాది ఈ రేసు నిర్వహించే సూచనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్లో మీరు మార్నింక్ వాక్ కోసం వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. కానీ పార్క్ బయట పరిసరాల్లో మాత్రం వాకింగ్ చేయకండి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే జులై 4న మార్నింగ్ వాకర్స్ ను ఓ కారు ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఓ స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి ఇద్దరు మహిళలను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కూడా మృత్యువాత చెందారు. ఆ వివరాలెంటో ఇ...
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.
మొన్నటి వరకు న్యూఢిల్లీ, చండీగఢ్, గుజరాత్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కండ్లకలక వ్యాధి..ఇప్పుడు తెలంగాణలో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దాదాపు 600 దాటేసింది. ఈ నేపథ్యంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు తల్లిదండ్రలకు సూచిస్తున్నారు.
ఈజీ మనీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పలువురు కేటుగాళ్లు అనేక రకాల మాయమాటలు చెప్పి దోచుకున్న సందర్భాలు గతంలో అనేకం చుశాం. ఇప్పుడు తాజాగా మరో ప్రబుద్ధుడు అలాంటి ఘటనలోనే దొరికిపోయాడు. ఇతను ఏకంగా టీచర్ కావడం విశేషం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.9.5 కోట్లు పలువురి నుంచి లూటీ చేశాడు.
మాజీ మంత్రి నారాయణ తన భర్త సుబ్రహ్మణ్యం బెదిరిస్తున్నారని పొంగూరు కృష్ణక్రియ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తన మానసిక స్థితి బాలేదని చెప్పిన దాంట్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. చీరలో చూడాలని ఉందని, ఫోటోలు పంపించమని ఆ మహిళను వేధించసాగాడు. విసుగు చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
బ్రో మూవీ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తాజాగా అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిళ్లతో వీరంగం సృష్టించారు. దాడులు చేసుకోవడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.