తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను ప్రభుత్వం నుంచి తొలగించాలని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం వెంటనే ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమ కుటుంబం గత 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(KMR Cricket Tournament) లో అపశృతి చోటు చేసుకుంది.కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ లో క్రికెట్ టొర్నీలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో శనిగరం అంజనేయులు (Anjaneyulu) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని అడిగారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీ లో చేరారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి(Jutur Kirti Reddy) కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయనకు పోయే కాలం దగ్గరపడిందని చెప్పారు. అందుకే పోలీసుల చేత వేధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా అడుగు పెడతాడని ప్రశ్నిస్తోంది. గతంలో మాదిరే మరోసారి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
వరంగల్ నిట్(Warangal Nit) 2023 వసంతోత్సవ వేడుకలను జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకు విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లలేదని, తన జీవితంలోని కొన్ని సంఘటనలను మీతో పంచుకోవడానికి వచ్చానని పవన్ వెల్లడించారు