MBNR: జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(AO) బోవల్ల వెంకటేవ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా ఎరువులు ఎలా సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
WGL: ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షల పర్యవేక్షణ కట్టుదిట్టంగా నిర్వహించాలని వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో పరీక్షా పర్యవేక్షణాధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి DIEO పలు సూచనలను చేశారు.
ASF: పోలీస్ క్రీడల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన నాల్గవ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులకు పలు పతకాలు లభించాయి. సెపక్ తక్రాలో పొట్ట గోపి బృందం సిల్వర్ సాధించగా, మహిళల బాడ్మింటన్‌లో సువార్త సిల్వర్ గెలుచుకుంది. బాక్సింగ్‌లో పూల్ సింగ్ సిల్వర్, టైక్వాండోలో పూల్ సింగ్, వినయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
SRPT: మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేటలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణకవచాలని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రమాద బాధితులను కాపాడి ‘రహదారి హీరోలు’ కావాలని పిలుపునిచ్చారు.
NLG: చేనేత కార్మికుల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించి 20 నెలలైనా హామీ నెరవేరలేదని, పొదుపు పథకం నిధులు విడుదల చేయాలని కోరారు. షరతులు లేకుండా చేనేత భరోసా, పెండింగ్‌లో ఉన్న నేతన్న బీమా చెల్లించాలన్నారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని పోనుగోడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట రోగి మంగళవారం బంధువులు రాస్తారోకో నిర్వహించారు. గర్భాశయ గడ్డ శస్త్రచికిత్సలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూత్రనాళాలు దెబ్బతిని రోగి పరిస్థితి విషమించిందని వారు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆధ్వర్యంలో సొంత అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో అవసరమైన నిత్యవసర వస్తువులను మంజూరు చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
KMM: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా ఉద్యానవన శాఖాధికారి పరిశీలించారు. మొక్కల కత్తిరింపు, ఇతర నిర్వహణ పనులను పర్యవేక్షించిన ఆయన, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పోచారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు బిక్షపతి, శ్రీశైలం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.
BDK: కొత్తగూడెం క్లబ్ నందు విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.
JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు అందజేశారు.
SDPT: గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు అభివృద్ధి కంటే దానిని రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పుష్కర ఘాట్లు, వీఐపీ ఘాట్లు, తాత్కాలిక స్నాన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
WNP: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు సలహాలు తెలియజేయడానికి 9959226289కు ఫోన్ చేయవచ్చని సూచించారు. వనపర్తి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KNR: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు తొంగిచూస్తాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జరిగిన తమ్మనవేణి మల్లమ్మ, పుట్ట స్వరూప, పుత్లీ బేగం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.