కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా దర్యాప్తు చేయాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు ఒక ఫ్యాషన్‌లా మారిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
NRPT: ఈ నెల 25వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని PDSU నాయకుడు శ్రీహరి యాదవ్ కోరారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచూసుకోవాలని, సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం ఉండాలని, పరీక్ష సమయానికి అనుకూలంగా RTC బస్సులను నడిపించాలని కోరారు.
సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ. 250 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ.10–15 వరకు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని స్థానికులు తెలుపారు.
NRML: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కుబీర్ SI కృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని సిర్పెల్లి రహదారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
ADB: తాంసి మండల గ్రామాలలో ఆదివారం ఎలాంటి కరెంటు అంతరాయం ఉండదని తాంసి విద్యుత్ శాఖ AE మనోజ్ పేర్కొన్నారు. మండలంలోని చాలా గ్రామాలలో శుభకార్యాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు కరెంట్ నిలిపివేయ వద్దని కోరగా.. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
SRCL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే నిలిచిపోయిన మానాల-మర్రిమడ్ల బీటీ రోడ్డు పనులు తిరిగి ప్రారంభమయ్యాయని పార్టీ మండల అధ్యక్షుడు తూమ్ జలపతి అన్నారు. మండలంలోని మానాల-మరిమడ్ల రోడ్లు పనులు ఇటీవల ప్రారంభం కాగా శనివారం వీరునితండా గ్రామ సమీపంలో బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.
ADB: బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ రాంనగర్ గ్రామంలో తగిరే ప్రదీప్ ఇటీవల విడుదలైన స్టాఫ్ సెలక్షన్ ఫలితాల్లో CRPF ఉద్యోగం సాధించాడు. తన కుమారుడి విజయం పట్ల తండ్రి కర్తర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సుందర్ సింగ్ యువజన సంఘాల నాయకులతో కలిసి ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందించారు.
WGL: సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనబోతుల సదయ్య 2005లో పోగొట్టుకున్న సెల్‌ఫోన్ తాజాగా లభించింది. అప్పట్లో చేసిన ఫిర్యాదు మేరకు ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఇటీవల ఫోన్‌లో సిమ్ వాడటానికి ప్రయత్నించగా అలర్ట్ రావడంతో పోలీసులు ట్రేస్ చేసి ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం బాధితుడికి అప్పగించారు.
MHBD: ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్‌ను గ్రామ సర్పంచ్ మలిశెట్టి శోభన్ స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామ ప్రజలు దోమల వలన ఇబ్బందులు పడుతున్నారని, ఫాగింగ్ మిషన్ తెప్పించినట్లు తెలిపారు. ఈ మిషన్ పొగ రూపంలో ఔషధాన్ని పిచికారి చేసి దోమలను నశింపజేస్తుందని అన్నారు.
KNR: చిగురుమామిడి మండల విద్యాశాఖాధికారిగా ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎంఈవోగా ఆమె అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో కుల్మోనాదుల దాడిలో రెండు నెలల చిన్నారి మరణించిన ఘటనపై టి.ఆర్.పి చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు కుమ్మెర వస్తున్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా నిలుస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ADB: పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు నిందితులు మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రూరల్ SI విష్ణువర్ధన్ తెలియజేశారు. నిన్న సిబ్బందితో సమావేశమై వివరాలను వెల్లడించారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KMR: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, అటవీ భూముల రక్షణలో విఫలమైన పిట్లం రేంజ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అభిలాష్‌పై వేటు పడింది. ఈ మేరకు రాజన్న సర్కిల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అర్పణ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన పిట్లం రేంజ్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
PDPL: జిల్లాలోని గ్రామీణ యువతకు RSETI పెద్దపల్లి ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ రాకేష్ తెలిపారు. మగ్గం వర్క్, క్రియేటివ్ జువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్ స్టాల్, మొదలగు కోర్సులలో శిక్షణ పొందుటకు సంస్థలో, 9392221907 నంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.
BHPL: బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లింగాల MJP ప్రిన్సిపల్ జి. విజయ తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించినట్లు, పరీక్షా హాల్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలు సిద్ధం చేశామని వెల్లడించారు.