• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ కట్

సిద్దిపేట 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖాదర్పురా, సీతారాం నగర్, ఇందిరానగర్, పాత బస్టాండ్, సుభాష్ రోడ్, మెదక్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 07:10 AM IST

‘బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి’

MBNR: బీసీలు రాజ్యాధికారంకోసం భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ఉద్యమించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఛైర్మన్ చిరంజీవులు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ.. అణచివేయడానికి ఆగ్రకుల నాయకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

February 23, 2026 / 07:09 AM IST

‘రైతులకు యూరియా పంపిణీ’

KNR: జమ్మికుంట మండలంలోని రైతులకు వివిధ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ ఖాదర్ హుస్సేన్ తెలిపారు. మాచినపల్లి HACA కేంద్రానికి 340, నాగంపేట DCMS 340, జమ్మికుంట JRUPSS కేంద్రానికి 340 బస్తాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. యూరియా అవసరమైన రైతులు సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందవచ్చన్నారు.

February 23, 2026 / 07:02 AM IST

ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయలవలదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

February 23, 2026 / 07:01 AM IST

నిజాయితీ చాటుకున్న బస్ కండక్టర్

ADB: ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని పాండ్రకవడ నుంచి ఆదిలాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో కండక్టర్‌గా విధుల నిర్వర్తించిన సి. సతీశ్ ఆ సెల్ ఫోన్‌ను స్టేషన్ మేనేజర్ శ్రీరాములు సమక్షంలో సదరు ప్రయాణికుడికి అప్పగించి ఉదరాత చాటుకున్నారు. అతన్ని పలువురు అభినందించారు.

February 23, 2026 / 07:01 AM IST

నేడు కొవ్వొత్తుల ర్యాలీకి తీన్మార్ మల్లన్న పిలుపు

NGKL: కుమ్మర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో బీసీ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని TRP చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు.

February 23, 2026 / 06:50 AM IST

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి అర్తెవ్ అల్తెవ్ కార్యక్రమం

SRPT: ప్రజల ప్రాణ పత్రిక లక్ష్యంగా నేటి నుంచి వారం రోజులపాటు సూర్యాపేట జిల్లాలో రెండో దశ ‌అర్తెవ్ అల్తెవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించడం, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.

February 23, 2026 / 06:50 AM IST

నేడు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్ రాక

KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

February 23, 2026 / 06:48 AM IST

కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ అంశం మరింత జఠిలంగా మారడంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణల వరకు వెళ్లింది. తాజాగా ఈ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

February 23, 2026 / 06:40 AM IST

నిరుద్యోగులకు GOOD NEWS

KNR: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈనెల 24న జాబ్ మేళాను KNR ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి తెలిపారు. ఫ్లిప్ కార్ట్, ఈకార్ట్ KNR సంస్థలో 20 డెలివరీ బాయ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హతలు- 10వ తరగతి ఉత్తీర్ణులై, వయసు 18- 35 మధ్య ఉండాలన్నారు. నెలకు 22500, 30000 వరకు జీతం వస్తుందన్నారు.

February 23, 2026 / 06:29 AM IST

‘రోడ్డు భద్రత నియమాలపై అవగాహన తప్పనిసరి’

PDPL: రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు. 8 ఇంక్లైన్ సిర్కే బస్టాండ్ వద్ద రోడ్డు భద్రత నియమాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి హనం వాహనాలు నడపవద్దని సూచించారు. పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:28 AM IST

కాలువలో పడి.. ఒడిశా వాసి మృతి

MLG: మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులోని కాలువలో పడి ఒడిశాకు చెందిన మిఠాలాల్ టండి (55) మృతి చెందాడు. ఇటుక బట్టీ పనుల కోసం ములుగుకు వచ్చిన ఆయన శనివారం వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం సాయంత్రం కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 06:26 AM IST

రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన

WNP: మస్తిపురం ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై స్వాతి ఆదివారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తూ, అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

February 23, 2026 / 06:26 AM IST

బస్సు కింద పడి గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

GDWL: జిల్లాలో విషాదం నెలకొంది. ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగనపల్లెకు చెందిన అంజలి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది. హైదరాబాద్‌లో చదువుతున్న అంజలి, తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

February 23, 2026 / 06:25 AM IST

చండూరులో వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

NLG: చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఆలయంలో హోమం, బలిహరణ, భేరి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మండపంలో పురోహితులు హరికిషన్ శర్మ, ప్రవీణ్ శర్మల ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.

February 23, 2026 / 06:25 AM IST