పాలమూరు-రంగారెడ్డి ( Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.సుప్రీంకోర్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ఊరట లభించింది.
బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సుప్రీం కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.! అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు (CBI) సీబిఐ కి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీం కోర్టు తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)ఈ నెల 8న విచారణ చేపట్టింది.
తెలంగాణ (Telangana) రాష్ట్రానికి మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్ రావు( harish rao) అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన కేంద్రపై ధ్వజమెత్తారు.
himanshu golden hour cover song:మంత్రి కేటీఆర్ (ktr) తనయుడు హిమాన్షు (himanshu) తన ప్రతిభను చాటుతున్నారు. ఓ పాప్ గీతానికి (pop song) కవర్ సాంగ్ (cover song) చేశారు. అమెరికన్ సింగ్ జేవీకేఈ రూపొందించిన గోల్డెన్ అవర్ సాంగ్‌కు కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ చానల్‌లో షేర్ చేశారు. ఇదే తన తొలి కవర్ సాంగ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కవర్ సాంగ్‌పై మంత్రి కేటీఆర్ (ktr) సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ రోడ్లపై మూడు డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రిక్స్ షో సందర్భంగా ఈ నెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని ఆర్టీసీ తెలిసింది. మెట్రో రూట్, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని చోట వీటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ( hero)మోటోకార్ప్' (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది.ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు.
సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
Sharmila Padayatra : వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో షర్మిల పాదయాత్ర ముగియనుంది. మార్చి 5న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ముగింపు సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) అద్భుత కానుక అందించింది. తాను కలలుగన్న ప్రాజెక్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణంపై వేసిన కేసులపై విచారించిన ధర్మాసనం ప్రాజెక్టు పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానం చేశారు. కొంత మంది రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున సాయంత్రం పెద్ద ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్...
తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ తమ మంత్రులకు ఒకే అబద్ధం చెప్పే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
MP Santhosh : సీఎం కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా... ఆయనకు ఎంపీ సంతోష్ అరుదైన బహుమతి ఇచ్చారు.
హైదరాబాద్ లో గత ఏడాది దసరా పండుగ సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనను పోలీసులు చేధించారు. ఆ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారీగా బాణసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు అక్కడ కట్టిన బెలూన్లపై పడ్డాయి. అలంకరణపై బెలూన్లు పడడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో అందరూ భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ చెదురుముదురుగా వెళ్లిపోయారు.