తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్‌గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం...
టాలీవుడ్ సింగర్ శ్రీ రామ చంద్ర హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతల కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేయడం ఏంటీ అని ట్వీట్ చేశారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఓ రాజకీయ నేత కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారని తెలిపారు. జనం ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్లాల్సి వచ్చిందట. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికిల్స్ రద్దీతో ప్రయాణం అరగంట […]
భారతదేశంలోనే అత్యధిక లాభాలతో కొనసాగుతూ.. సిరులు కురిపిస్తున్న సంస్థ సింగరేణి. ఈ సంస్థలో ఉద్యోగమంటే ఉత్తర తెలంగాణ ప్రాంత యువతకు ఓ కలలాంటిది. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలని ఎప్పటి నుంచో నిరుద్యోగులు కలలు కంటున్నారు. అలాంటి వారికోసం సింగరేణి మరో ప్రకటన విడుదల చేయనుంది. సింగరేణి సంస్థలో 558 ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని సింగరేణి సంస్థ ప్రకటించింది. ...
తనను తెలంగాణ నుంచి తరిమేస్తారా.. తరిమేయండి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అని తెలిపారు. తాను మాత్రం ధర్మ మార్గం విడవని ప్రకటించారు. విద్వేష ప్రసంగాలతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారంటూ తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మంగళవారం స్పందించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన జీవితం ధర్మం కోసమేనని ప్రకటించారు. ఎక్కడో ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్న...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదిన నుంచి శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పిబ్రవరి 3వ తేదీ శుక్రవారం రోజున సమావేశాలను ప్రారంభించనున్నట్లుగా స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యలు ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం అందించారు. ...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి డీఈవోను కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. తమ పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న...
మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ నోటీసులు ఇవ్వటమేంటీ అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ తనదైన శైలిలో రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకవర్గం మనోభావాలను కించపర్చే విధంగా వీడియో పోస్టు చేసినందుకు ఆయనపై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చ...
గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తాము చేసిన అప్పులకు వడ్డీ భారీగా పెరుగుతోందని వాపోయింది. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న వినడం లేదనే ఆవేదనతో మహిళా సర్పంచ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో చోటుచేసుకుంది. చదవండి: మోడీ వి...
ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందని చిన జీయర్ స్వామిజీ వెల్లడించారు .అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారని తెలిపారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారని. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం...
తెలంగాణలో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు మొదలవడం కలకలం రేపింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల...
తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. గవర్నర్, ప్రభుత్వం మొండి పట్టు పట్టడంతో తెలంగాణలో సంప్రదాయం ప్రకారం జరుగాల్సిన కార్యక్రమాలు కట్టు తప్పాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తూ ఓ పార్టీ నాయకురాలిగా వ్యవహరించడం.. బిల్లులకు ఆమోదం తెలపకపోవడం వంటి వాటితో రాష్ట్ర ప్రభుత్వం కినుక వహించింది. అందుకే గవర్నర్ కుర్చీకి కనీస గౌరవం ఇవ్వ...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని మంత్ర ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ కూడా కలిశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి పొసగడం లేదు. ఇటీవల జరి...
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని జనవరి 30 తో ముగియనున్న గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3 వ తేదీ వరకు గ్రూప్ 4 కి అప్లయి చేసుకోవచ్చు. గ్రూప్ 4 లో అదనపు పోస్టులను కూ...
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3న ప్రారంభం కానున్నాయని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది కానీ.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. గవర్నర్ పై కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. హైకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి త...
జయశంకర్ భుపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేశాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్ కు తరలించారు. వారి వెంట సుమారు వంద మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్‌లు కేటాయించాలని, నిరుపేదలకు న్యాయం జరిగేంత వర...