తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) హెలికాఫ్టర్ (Helicopter)లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. హెలికాఫ్టర్ మొరాయించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ (Asifabad) సభకు బయల్దేరారు. సిర్పూర్ కాగజ్ నగర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాకపోవడంతో కొంత ఆందోళన నెలకొంది. పైలట్ అప్రమత్తతో హెలికాఫ్టర్‌ను నిలిపివేశారు. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ జోరుగా ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirwada sabha) పాల్గొంటున్నారు.
నవంబర్ 30న ఓటింగ్ ఉండగా ఈనెల 28వ తేది వరకూ ఆయన సభల్లో పాల్గొంటారని బీఆర్ఎస్ (BRS) వెల్లడించింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజూ మూడు నుంచి నాలుగు సభల్లో ఉండేలా చూస్తున్నారు. ఆ సభలకు వెళ్లేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్‌ను ఉపయోగిస్తున్నారు. మొన్న సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం (Technical Error) తలెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ ఇబ్బంది రావడంతో రోడ్డు మార్గం ద్వారా ఆయన ఆసిఫాబాద్‌కు బయల్దేరారు.
మొన్న సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరినప్పుడు కూడా సమస్య తలెత్తింది. హెలికాఫ్టర్ (Helicopter) పైకి లేచిన కొద్ది సమయంలోనే సాంకేతిక సమస్య తలెత్తగా పైలెట్ సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. తాజాగా మరో సమస్య రావడంతో కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించారు. ఇకపై హెలికాఫ్టర్‌లో సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.