బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులను బెదిరించడంతో పాటు…. ఇంటిని చాలా వరకు ధ్వంసం చేశారు. కాగా…. ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ దాడికి సంబంధించి మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కేసులు నమోదైన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజా, రామ్ యాదవ్, టీఆర్ఎస్వీ నేత స్వామి వున్నారు. వారిని మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. ఎంపీ అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఖండించారు. హైదరాబాద్ లోని ఎంపీ నివాసంపై దాడి చేసి ధ్వంసం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఆమె పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం ఖండనీయమన్నారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె తెలిపారు.