తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు. 4 రోజుల్లో 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు మంత్రి వెల్లడించారు.
దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు.సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం విదితమే