»Interesting Comments By Ka Paul On The Inauguration Of The Secretariat
Secretaria : సచివాలయం ప్రారంభోత్సవంపై…కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సెక్రటేరియట్ (Secretariat) ప్రారంభోత్సవం వాయిదాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ (KA Paul) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సచివాలయం వాయిదా పడిందన్నారు. అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) రోజున ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ప్రారింభించాలని హైకోర్టు (High Cour) లో న్యాయ పోరాటం చేశామని వెల్లడించారు.
సెక్రటేరియట్ (Secretariat) ప్రారంభోత్సవం వాయిదాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ (KA Paul) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సచివాలయం వాయిదా పడిందన్నారు. అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) రోజున ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ప్రారింభించాలని హైకోర్టు (High Cour) లో న్యాయ పోరాటం చేశామని వెల్లడించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన పోరాటం వల్లనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. అయితే.. సీఎం కేసీఆర్ తన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికల కోడ్ తీసుకొచ్చి వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున (KCR’s birthday) ప్రారంభించకుండా చేశామని హర్షం వ్యక్తం చేశారు. సెక్రెటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేశారు
.కాగా.. మొదట సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఘనంగా ముందస్తు ఏర్పాట్లు చేసింది. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సభకు తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తదితరనేతలకు ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఇంతలోనే సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ ను ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గద్దర్ (Gaddar) వినతిపత్రం సమర్పించారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ భవన్ గా నామకరణం చేశారు. అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ జయంతి రోజున కాకుండా కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభించడం ఏమిటని కేఏ పాల్ ప్రశ్నించారు. తెలంగాణ సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2021 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల (Department of Finance) కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు.