»Hyderabad Marathon 2023 August 27th 2023 Traffic Restrictions Some Areas Morning 430 Am And 10 Am
Hyderabad:లో నేడు మారథాన్ రన్..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో(hyderabad) ఈరోజు మారథాన్-2023(Marathon 2023) రన్నింగ్ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Cyberabad Traffic Police) ఆదివారం ఉదయం 4:30 నుంచి 10 గంటల మధ్య పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.
hyderabad Marathon 2023 august 27th 2023 Traffic restrictions some areas morning 4:30 am and 10 am
హైదరాబాద్‌లో నేడు మారథాన్-2023(Marathon 2023) రన్నింగ్ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఉదయం 4:30 గంటల నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమం నగరంలోని వివిధ రోడ్లపై జరుగుతుంది. ఫుల్ మారథాన్/హాఫ్ మారథాన్ రెండూ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కి.మీ దూరం కొనసాగనున్నాయి. 10 కి.మీ రన్ హైటెక్స్ NAC మెయిన్ గేట్, మాదాపూర్ నుంచి మొదలయ్యాయి.
10 కి.మీ మారథాన్ రూట్:హైటెక్స్, మాదాపూర్ – NAC మెయిన్ గేట్ – ఖానామెట్ జంక్షన్ లోపల ప్రారంభమైంది. మెటల్ చార్మినార్ కుడి మలుపు, CII Jn. ఎడమ మలుపు – టెక్ మహీంద్రా – డెల్ జంక్షన్ – HSBC జంక్షన్ – ఎడమ మలుపు – లెమన్ ట్రీ జంక్షన్ – కుడి మలుపు – IKEA అండర్ బ్రిడ్జ్ – NCB జంక్షన్ – కుడి మలుపు – గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా – IIIT జంక్షన్ – గచ్చిబౌలి స్టేడియం దగ్గర ముగుస్తుంది.
21 కిమీ హాఫ్ మారథాన్ రూట్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలో సైబరాబాద్ పరిమితుల్లో రోడ్ నెం.45 వద్ద ప్రవేశిస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ – ITC కోహినూర్ – మై హోమ్ అబ్రా – C గేట్ జంక్షన్ – IKEA (మైండ్‌స్పేస్ రోటరీ) – ఎడమ మలుపు – NCB Jn. – కుడి మలుపు – గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా – IIIT జంక్షన్ మరియు గచ్చిబౌలి స్టేడియం లోపల ముగుస్తుంది.
42 కి.మీ పూర్తి మారథాన్ రూట్: పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిమితుల వద్ద ప్రారంభమైంది. రోడ్ నెం-45 వద్ద సైబరాబాద్ పరిమితుల్లోకి ప్రవేశిస్తుంది – కేబుల్ బ్రిడ్జ్ – ITC కోహినూర్ – మై హోమ్ అబ్రా – C గేట్ జంక్షన్ – IKEA (మైండ్‌స్పేస్ రోటరీ) – ఎడమ మలుపు- NCB Jn- కుడి మలుపు – గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా – IIIT Jn – HCU మసీదు బండా గేట్ నుంచి నిష్క్రమించి, గేట్ నంబర్ 2 నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈవెంట్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
మరోవైపు హైదరాబాద్(hyderabad) ప్రధాన రోడ్ల(main roads)పై రన్నింగ్ పోటీ నిర్వహించడంపై స్థానికులు(local people) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్(running) నిర్వహించే ప్రాంతాల నుంచి వెళ్లాలంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఔటర్ రింగ్ రోడ్ లేదా ప్రజలు తక్కువగా ప్రయాణించే రోడ్లపై నిర్వహించుకోవాలని చెబుతున్నారు. జనాలు ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అనేక మందికి ఆటంకం ఏర్పడుతుందని, వారి పనులు ఆలస్యం అవుతున్నాయని వాపోతున్నారు.