NLG: నూతన సంవత్సర వేడుకల సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రహదారులపై హంగామా, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ను సహించబోమని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన నియమాలు అమలు చేస్తున్నారని, ప్రజలు సహకరించి శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.