KNR: సింగరేణి సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బలరాం నాయక్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ సిబ్బంది శిక్షణ విభాగం సిఫారసులు ఆమోదించింది. దీనితో మరో ఏడాది సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బలరాం నాయక్ కొనసాగనున్నారు.