MBNR: చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్‌ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఎంపీ, కలెక్టర్ ప్రారంభించారు.