MDK: ఈనెల 25, 26 తేదీలలో రేగోడ్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-14, 17 విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు MEO గురునాథ్ తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, KGBV, మోడల్ స్కూల్ HM, PETలు తమ పాఠశాలల నుంచి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాలలో విద్యార్థులను ఎంపిక చేసి జట్లుగా పంపాలని సూచించారు.