SRD: న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ మృతి చెందారు. గురువారం ఇంటిలో సృహతప్పి కింద పడిపోగా, వెంటనే జహీరాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సహా ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతి కార్యదర్శులు సంతాపం తెలిపారు.