MDK: నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మెదక్‌కు చెందిన గొల్ల రాములు కుటుంబానికి రూ.16,500/- చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సహాయాన్ని సకాలంలో అందజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.