WGL: నర్సంపేట మహిళా సబ్ జైలర్ లక్ష్మి శృతిని ఆదివారం సస్పెండ్ చేశారు. రిమాండ్ ఖైదీ సుచరిత అనారోగ్యంతో మృతి చెందిన ఘటనలో, ఆమె ఆరోగ్య స్థితిని సరిగా అంచనా వేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఈ చర్య తీసుకున్నారు. జైళ్ళ శాఖ విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఉమెన్ జైలర్ స్రవంతిని పూర్తి స్థాయి ఇన్ఛార్జ్గా నియమించారు.